బండారు దత్తాత్రేయను కలిసిన మంత్రి ఎర్రబెల్లి

219
Errabelli

మాజీ కేంద్ర మంత్రి, బీజేబీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఇటివలే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.   గవర్నర్ గా  నియమితులైన   అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు.

ఈసందర్భంగా ఇవాళ ఉదయం మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు దత్తాత్రేయను కలిశారు. ఈసందర్భంగా ఆయనకు పూల బోకే ను ఇచ్చి శుభాకాంక్షాలు తెలియజేశారు. కాసేపు రాష్ట్ర రాజకీయాలపై వారివురు చర్చించుకున్నారు. అనంతరం ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈకార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆయన కుమారుడు కూడా బండారు దత్తాత్రేయను కలిశారు.

తెలంగాణ బిడ్డకు ఉన్నతమైన పదవి రావడం హర్షణీయమని మంత్రి దయాకర్ రావు అన్నారు. దత్తాత్రేయ గారు ఆదర్శనీయ వ్యక్తి అని పేర్కొన్నారు. దత్తాత్రేయ గారు తమ కుటుంబానికి దగ్గరి వ్యక్తి అని… ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.