కార్పొరేట్ విద్యకు ధీటుగా గురుకుల పాఠశాలలుః మంత్రి ఎర్రబెల్లి

328
errabellidayakar rao
- Advertisement -

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.

ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…ప్రతి ఒక్క పేద విద్యార్ధికి నాణ్యమైన విద్య అందించాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ప్రారంభించారన్నారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పూర్తిగా విద్యను భ్రష్టు పట్టించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

అనంతరం స్టేషన్ ఘన్పూర్ లోని జ్యోతిరావు పూలే బిసి గురుకుల పాఠశాల ప్రారంభించారు. 70 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వాలు 19 పాఠశాలను ప్రారంభించగా 5ఏళ్ల లో 119 ( 63 బాలుర, 56 బాలికల ) పాఠశాలలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారని చెప్పారు. ఇంకా 119 పాఠశాలలను ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి 1.20 లక్షలు ఖర్చు చేస్తుందని తెలిపారు

- Advertisement -