మ‌రింత క‌ట్టుదిట్టంగా లాక్ డౌన్ : మంత్రి ఎర్రబెల్లి

47
errabelli

మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. క‌రోనా అంతానికి మ‌నం చేస్తున్న లాక్ డౌన్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు లభిస్తున్నాయని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో పర్యటించిన ఎర్రబెల్లి ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇళ్ళ‌ను వీడొద్దని సూచించారు.

సంపూర్ణ లాక్ డౌన్ మ‌న ఐక్య‌త‌ను, స‌హ‌నాన్ని, పోరాట ప‌టిమ‌ను చాటుతున్న‌ది. గుళ్ళు, మ‌సీదులు, చ‌ర్చీల‌కు వెళ్ళ‌డాన్ని ప్ర‌జ‌లు మానేయాలన్నారు. కరోనాను తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ప్ర‌జా సంక్షేమానికి ఎంత‌కైనా వెళ‌తారు. ప్ర‌జ‌ల్ని ర‌క్షించ‌డానికి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగులంతా నిరంత‌రం ప్రాణాల‌కు తెగించి ప‌ని చేస్తున్నారని చెప్పారు.

తర్వాత పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌రిధిలోని రాయ‌ప‌ర్తి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మ‌క్క‌ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాయ‌ప‌ర్తి వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ని స్వ‌యంగా మంత్రి పిచికారి చేశారు. ప్ర‌ల‌జ‌కు మాస్కుల పంపిణీ – పేద‌ల‌కు ఉచిత బియ్యం పంపిణీ చేశారు.