టాపింగ్‌ ఔట్‌ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌

321
Minister ktr ,
- Advertisement -

హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్‌ భవనాన్ని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నత్‌ జస్టర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. యూఎస్‌ కాన్సులేట్‌ భవనం హైదరాబాద్‌లో ఏర్పాటుకావడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్యం గల అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్యం గల భారత్‌ మంచి సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచానికి మంచి చేస్తుందని చెప్పారు.

రెండుదేశాల మధ్య సత్సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ కృషిచేస్తున్నారని గుర్తుచేశారు. భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కే వచ్చారని గుర్తుచేసిన కేటీఆర్‌.. నాటినుంచి తెలంగాణకు ఒక మంచి స్నేహితుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -