బీహార్‌లో ఎంఐఎం బోణి..

460
asaduddin
- Advertisement -

మహారాష్ట్ర, హర్యానాతో పాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఉప-ఎన్నికల కౌంటింగ్ కూడా సాగుతోంది. మహారాష్ట్రాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఎంఐఎం చీల్చగా బీహార్‌లో ఆ పార్టీ బోణి కొట్టింది. కిషన్‌గంజ్‌​ ఉప ఎన్నికలో మజ్లిస్‌ విజయం సాధించింది.

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పూర్తిగా చతికలపడింది. మైనార్టీ ఓట్లను ఒకతాటిపైకి తీసుకురావడంలో ఆ పార్టీ విఫలమైంది. ఎంఐఎం రూపంలో కాంగ్రెస్‌ కూటమి ఓట్లకు భారీగా గండి పండింది. కాంగ్రెస్‌ కంటే ఎన్సీపీ మెరుగ్గా రాణించింది. ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికిపైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం.

ఇక హర్యానాలో బీజేపీ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ హంగ్ దిశగా సాగడంతో జేజేపీ మద్దతు కీలకంగా మారింది.

- Advertisement -