గోపిచంద్ తో మిల్కీ బ్యూటీ రోమాన్స్

166
Tamannaah

మాచో హీరో గోపిచంద్ త్వరలోనే చాణక్య మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాలో మెహ‌రీన్ హీరోయిన్ గా నటించగా.. కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుని సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఇక గోపిచంద్ తన తర్వాతి మూవీ సంపత్ నంది దర్శకత్వంలో చేయనున్నారు..

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ పూర్తైంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు సమచారం. ఈసినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నట్లు గా తాజా సమాచారం. సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా గతంలో బెంగాళ్ టైగర్ చిత్రంలో నటించింది.