లీటర్ పాల ధర రూ. 140

285
Milk Rates High In Pakistan

ఒక్కసారిగా పాల ధర చికెన్ రేటును మించి పోయింది.మొహర్రం పండుగ సందర్భంగా పాలకు రెక్కలొచ్చాయి. లీటరుకు రూ.40 ఉండే పాలు ఇప్పుడు ఏకంగా రూ.140 ధర పలుకుతుంది. అయితే ఇది ఇండియాలో కాదు లేండి.. మన పక్క దేశం పాకిస్ధాన్ లో. మొహర్రం పండుగ రోజు పాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

పాకిస్ధాన్ లోని ముఖ్యమైన నగరాలైన ఇస్లామాబాద్, కరాచి లాంటి నగరాల్లో పాల ధర లీటర్‌కు రూ. 120 నుంచి రూ. 140 వరకు పలికింది. కాగా, పాక్‌లో లీటర్ పెట్రోల్ ధర 113రూపాయలు, డీజిల్ 91 రూపాయలు కానీ, పాల ధర మాత్రం వాటిని మించిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటిసారిగా పాల రేటు పెట్రోల్ ను మించిపోయిందని చెబుతున్నారు.