ముంబై ప్లే ఆఫ్ ఆశలు సజీవం…

195
- Advertisement -

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై సత్తాచాటింది. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌ లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ పై గెలిచింది. పంజాబ్ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కొల్పోయి చేధించింది. ముంబయికి సూర్యకుమార్‌ మంచి ఆరంభాన్నిచ్చాడు. లూయిస్‌ (10) విఫలమైనా.. సూర్యకుమార్ చెలరేగిపోయాడు. తనే ఎక్కువగా స్ట్రైక్‌ తీసుకుంటూ.. చక్కటి షాట్లు ఆడుతూ ఛేదనను నడిపించాడు.

క్రీజులో కుదురుకున్నాక ఇషాన్‌ కిషన్‌ (25; 19 బంతుల్లో 3×6) కూడా మెరుపు సిక్సర్లతో అలరించాడు. సూర్యకుమార్‌ను ఔట్‌ చేయడం ద్వారా స్టాయినిస్‌ ఈ జోడీని విడదీశాడు. చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ నెలకొంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 42 బంతుల్లో 6×4, 3×6), కృనాల్‌ పాండ్య (31 నాటౌట్‌; 12 బంతుల్లో 4×4, 2×6),రోహిత్ శర్మ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

 MI revive ..handsome win over KXIP

అంతకముందు టాస్ గెలిచిన ముంబై..పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. క్రిస్ గేల్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టాయినిస్‌ (29 నాటౌట్‌; 15 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. టాప్ ఆర్డర్ విఫలమవడంతో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. బుమ్రా (1/19), మయాంక్‌ మార్కండే (1/29) పంజాబ్‌కు కళ్లెం వేశారు.

- Advertisement -