నాగోల్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మెట్రో షటిల్ బస్ లు

395
metro
- Advertisement -

నాగోల్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ల నుంచి రామోజీ ఫీల్మ్ సిటీ వరకు మెట్రో షటిల్ బస్సు సేవలను ప్రారంభించారు. ఎల్ అండ్ టీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సైనీ, రామోజీ ఫిల్మ్ సిటీ సీఈవో రాజీవ్ జెల్నా పుర్కర్. నాగోల్ స్టేషన్ వద్ద ఈబస్సులను ప్రారంభించారు. శని, ఆది వారాల్లో నాగోల్ , ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ల నుంచి ఫిల్మ్ సిటి వరకు ఉదయం 8గంటల నుంచి 8.30గంటల వరకు నడుపనున్నారు.

అలాగే సాయంత్రం వేళలో రామోజీఫిల్మ్ సిటి నుంచి నాగోల్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ల వరకు సాయంత్రం 6గంటల నుంచి 6.30గంటల వరకు నడుపనున్నట్లు తెలిపారు అధికారులు. మొదటి విడతగా వీకెండ్ లో అలాగే సెలవు దినాల్లో ఈ షటిల్ బస్సు లను నడుపనున్నారు. ఆ తర్వాత రద్దీని బట్టి మిగతా రోజుల్లో కూడా బస్సులను నడిపించనున్నట్లు తెలిపారు మెట్రో అధికారులు.

- Advertisement -