ఎంపీల విలీనం రాజ్యాంగబద్ధమేః కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

330
Kishan Reddy
- Advertisement -

రాజ్యాంగబద్దంగానే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. టీడీపీ విలీన ప్రక్రియను కొందరు అనవసరంగా విమర్శిస్తున్నారని చెప్పారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు ఆ పార్టీకి రాజీనామా చేశారని తెలిపారు.

 

ఆ నలుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు విలీన లేఖ ఇచ్చారని చెప్పారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని చెప్పారు. ఏ సభలోనైనా మూడో వంతు సభ్యులు విలీనం చేయాలని కోరితే అది చట్టవిరుద్ధం కాదన్నారు.ఇటివలే టీడీపీ నుంచి 4గురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు.

- Advertisement -