మెంటలెక్కిస్తున్నారు…!

72
Mental Madhilo movie promotions

అతి ఏదైనా సరే అనర్ధదాయకమే.. (అతి సర్వత్రా వర్జయేత్) అన్న విషయాన్ని ‘మెంటల్ మదిలో’ అనే సినిమా నిర్మాతలు విస్మరిస్తున్నారేమోననిపిస్తోంది. ఇంతకుముందు ‘పెళ్లి చూఫులు’ చిత్రాన్ని నిర్మించిన రాజ్ కందుకూరి అనే ఆయన ‘మెంటల్ మది’లో చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ చిత్రం చాలా చాలా బాగుందంటూ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే మెంటలెక్కిస్తున్నారు. పలువురు ప్రముఖులు ఈ సినిమాను ఓ కళాఖండంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు మరి కాస్త ముందుకెళ్లి.. కె.విశ్వనాధ్ కథ రాసి, దానికి జంధ్యాల డైలాగ్స్ అందించి.. మణిరత్నం దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందో ‘మెంటల్ మదిలో అలా ఉంటుందని చెడుబుతున్నాడు.  వీటన్నిటివల్ల ఈ చిత్రానికి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే.. పెద్దగా ఎక్సపెక్టైన్స్ లేకుండా ఒక సినిమా చూడడం వేరు.. భారీ అంచనాలతో చూడడం వేరు. నిజంగానే చాలా బాగుంటే సినిమాకి మంచే చేస్తుంది. కానీ ఏకొంచెం తేడా ఉన్నా బూమరాంగ్ అవుతుంది. ఈ విషయాన్నీ ‘మెంటల్ మండిలో యూనిట్ ఇప్పటికైనా గుర్తించి సినిమా రిలీజ్ వరకు ఓపిక పడితే మంచిది. శ్రీవిష్ణు అనే స్ట్రగులర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వివేక్ ఆత్రేయ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది!!