డోస్ పెంచిన ….మెహ్రీన్‌

332
Mehreen season begins..
- Advertisement -

మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హిందీ భామ మెహ్రీన్ కౌర్ పిర్.  కృష్ణగాడి వీర ప్రేమ గాథతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేసింది మూడు సినిమాలే ఐనా తన అందం,అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.  కృష్ణగాడి వీర ప్రేమగాథ తర్వాత శర్వానంద్‌తో  మహానుభావుడు సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం రవితేజ రాజా  ది గ్రేట్‌తో హ్యాట్రిక్‌ హిట్ కొట్టిన ఈ బ్యూటీ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతేగాదు అప్పుడే మరో అరడజను సినిమాలకు సైన్ చేసింది.

వారం రోజుల్లో ‘కేరాఫ్ సూర్య’తో పలకరించబోతోంది.  దీని తర్వాత  ‘జవాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మెహ్రీన్. ఐతే కేరాఫ్ సూర్య వరకు పద్దతిగానే కనిపించిన మెహ్రీన్‌ జవాన్‌లో మాత్రం మరో యాంగిల్ చూపించబోతోంది. ఇటీవల విడుదలైన బుగ్గంచున… పాట చూస్తే ఆ ఫీలింగే కలుగుతోంది.

ఈ పాటలో శారీలో చాలా సెక్సీగా కనిపించిన మెహ్రీన్‌…ఎక్స్‌ ప్రెషన్స్‌తో మతిపొగొట్టింది. శాంపిల్‌గా పాటలో కేవలం ఫోటోలు మాత్రమే చూపించిన చిత్రయూనిట్…వీడియో సాంగ్ చూస్తే కిక్కేక్కడం ఖాయమని చెబుతోంది. మరి మెహ్రీన్‌ ఏ మేరకు అందచందాలను ప్రదర్శించిందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

- Advertisement -