మెగాస్టార్ నయా లుక్‌.. వైరల్‌

443
chiranjeevi
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను కోడలు ఉపాసన ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆమె ‘బీ పాజిటివ్‌’ అనే హెల్త్‌ మ్యాగజైన్‌ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం చిరు ఫొటోషూట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త లుక్‌లో చిరు అదిరిపోయాడు.

Megastar

చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ సినిమా కోసం సిద్ధమౌతున్నాడు.. కథ ప్రకారం ఈ సినిమాలో చిరు రెండు పాత్రలు పోషించనున్నాడు. అందులో ఒకటి నక్స‌లైట్ పాత్ర అని ఫిల్మ్ నగర్ చెబుతున్నాయి. ఈ పాత్ర కోసం చిరంజీవి దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గాడు. అందుకోసం కేరళ వెళ్లి ప్రత్యేక చికిత్స తీసుకున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -