పూరీ జ‌గ‌న్నాధ్ కాపురంలో చిచ్చుపెట్టిన చిరంజీవి

289
Puri Jagannadh About Movie With Chiranjeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఇటివ‌లే సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ఫేస్ బుక్ వాడిన ఆయ‌న పెద్ద‌గా యూజ్ చేసేవారు కాదు. ఇటివ‌లే మెగాస్టార్ ట్వీట్ట‌ర్ అకౌంట్ ను ఒపెన్ చేశారు. ట్వీట్ట‌ర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ సంద‌డి చేస్తున్నారు. తాజాగా చిరు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ గురించి ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. క‌రోనా వైర‌స్ నేప‌ధ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల పూరి జగన్నాథ్ బ్యాంకాక్, ముంబై బీచ్ లను బాగా మిస్ అవుతుంటాడని చిరు ట్వీట్ చేశారు.

చిరంజీవి చేసిన ట్వీట్ కు స్పందించాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. చిరంజీవి సార్ పెట్టిన ట్వీట్ తన కొంప ముంచిందని అన్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకాక్ గురించి ఎందుకు ట్వీట్ చేశారో కానీ… మా ఆవిడ నా చెంప పగలగొట్టిందని చెప్పారు. చిరంజీవి సార్ ట్వీట్ చూసి గతంలో జరిగినవన్నీ మా ఆవిడకు గుర్తుకొచ్చాయని… దాంతో తన మీద చేయి చేసుకుందని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తుండ‌గా….పూరీ జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మూవీ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే చిరు పూరీ కాంబోలో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుంది.

- Advertisement -