చిరు 152.. హీరోయిన్లు ఫిక్స్

326
Chiranjeevi Koratala Siva
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహ‌రెడ్డి మూవీలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈచిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈమూవీ షూటింగ్ దాదాపు 80శాతం వ‌ర‌కూ పూర్తైంద‌ని స‌మాచారం. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలావరకూ చిత్రీకరించారు. ఈద‌స‌రాకు ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తుంది.

nayanatara

ఇక చిరు త‌న త‌ర్వాతి మూవీ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ స్టోరీని చ‌క్క‌దిద్దే ప‌నిలో ఉన్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈచిత్రం పూజా కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం. అయితే ఈసినిమాలో హీరోయిన్ గా ఎవ‌రిని తీసుకుంటార‌నేదానిపై టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మొద‌టి నుంచి కొర‌టాల శివ న‌య‌న‌తార ను తీస‌కుందామ‌ని చిరుతో చెబుతున్నాడ‌ట‌. కానీ ఆమెకు సినిమాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇన్ని రోజులు ఏటు చెప్ప‌లేక‌పోయింద‌ట.

Tamannah

తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇక మ‌రో హీరోయిన్ గా త‌మ‌న్నాను సంప్ర‌దించార‌ని తెలుస్తుంది. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింద‌ట‌. సైరా సినిమాలో కూడా చిరు స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తోంది. చిరు కొర‌టాల మూవీని మార్చిలో సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.

- Advertisement -