బిగ్ బీకి సైరా బర్త్ డే గిఫ్ట్..

267
Megastar Amitabh Bachchan
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం సైరా. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తుండగా అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

syra updates

బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే గిఫ్ట్‌ ఇచ్చింది సైరా టీం. అమితాబ్ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ మోషన్‌ టీజర్‌ ను విడుదల చేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌ కనిపిస్తాడని పేర్కొంది. పవర్‌ ఫుల్‌ లుక్‌ లో అమితాబ్ కనిపిస్తూ, సినిమాపై అంచనాలను మరింతగా పెంచారు.

ఈ సినిమాలో ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి లుక్ తో పాటు కన్నడ నటుడు సుధీప్‌ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. చిరు సరసన నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతి బాబు, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -