చిరు కొరటాల మూవీలో రామ్ చరణ్?

438
ram Charan Chiru Koratala
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారు.తాజాగా ఉన్న సమాచారం మేరకు చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తుంది.

ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఈమూవీకి సంబంధించి ఫిలిం నగర్ లో మరో వార్త చెక్కర్లు కొడుతుంది. చిరంజీవితో పాటు ఈసినిమాలో రామ్ చరణ్ కూడా నటించనున్నాడట. చిరంజీవి చిన్నప్పటి పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈమూవీకి సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నట్లు తెలుస్తుంది. సమ్మర్ ఈసినిమాను పూర్తి చేసి ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.

- Advertisement -