జబర్దస్త్ ను అస్సలు వదులుకోనుః నాగబాబు

48
nagababu Jabardasth

బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో లలో నెం1 స్ధానంలో ఉంది జబర్ధస్త్. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈకామెడీ షో ద్వారా చాలా మంది కమెడీయన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఈషోకు మొదటి నుంచి న్యాయనిర్ణేతలుగా వ్యవహిరిస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరిద్దరి వల్ల కూడా జబర్ధస్త్ షో ఇంత పాపులర్ అయిందని చెప్పుకోవాలి.అయితే వీరిద్దరూ ఇటివలే జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడంతో కొద్ది రోజులుగా షోకు రావడం లేదు.

వీరి స్ధానంలో శేఖర్ మాస్టర్, సీనియర్ హీరోయిన్ మీనాలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రోజా, నాగబాబు ఇకపై జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈవ్యాఖ్యలపై స్పందించారు నాగబాబు. జబర్ధస్త్ అంటే తనకు చాలా ఇష్టం అని..ఈ షోవల్ల తాను చాలా లాభంపొందానని చెప్పారు. నాకు ఆర్ధికంగా, కెరీర్ పరంగా జబర్ధస్త్ చాలా ఉపయోగపడిందని తెలిపారు.

ఎట్టి పరిస్ధితుల్లో తాను జబర్ధస్త్ ను వదులుకోబోనని..నెలకు నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ ఉటుందని..ఒకవేళ ఎంపీగా గెలిచినా ఎలాగోనా ఆ ఆనాలుగు రోజులు సర్దుబాటు చేసుకుంటానని వెల్లడించారు నాగబాబు. త్వరలోనే తాను తిరిగి జబర్దస్త్ షో లో కనిస్తానని తెలిపారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు బ్రేక్ పడినట్లే అని చెప్పుకోవాలి.