మీట్ అండ్ గ్రీట్ విత్ ..స్పీకర్ పోచారం

630
speaker pocharam
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) మరియు ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యూకే సంయుక్తంగా లండన్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ ” తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. యు.కే నలుమూలల నుండి భారీగా వివిద సంస్థల ప్రతినిదులు, తెలంగాణ వాదులు హాజరయ్యారు.

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి , కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ గత ఎనిమిది సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు, బంగారు తెలంగాణా నిర్మాణ దిశ లో టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి తాను రెవెన్యూ శాఖలో ఎటువంటి అవినీతి లేకుండా పనిచోస్తోందని, సాక్షాత్తూ ప్రదాని మోడి , ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ప్రశంసించారని తెలిపారు.

speaker pocharam

వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నాయకత్వంలో రైతులకు కలిగిన అభివృద్ధి గురించి ప్రవాసులు వివరించారు. సమైక్య పాలనలో ఎన్నడూ జరగని సంక్షేమం నేడు రాష్ట్రం లో జరుగుతుందని, దేశమంతా మనవైపే చూస్తుందని, నూతనంగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో ముందుండి నేడు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు.

బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌.. రైతుబంధు, రైతు బీమా ప‌థ‌కాలు చేప‌ట్టిన విష‌యం మనకు తెలిసిందేనని. అవి ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించాయని, ఐక్య‌రాజ్య‌స‌మితి ఈ రెండు ప‌థ‌కాల‌కు వినూత్న గుర్తింపు ఇచ్చిందని. యూఎన్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌.. ఈ రెండు ప‌థ‌కాల‌ను స‌క్సెస్ ప‌థ‌కాలుగా గుర్తించి. రైతుల సంక్షేమం కోసం వ్య‌వ‌సాయ రంగంలో వ‌స్తున్న వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను గుర్తిస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితి విభాగ‌మైన ఎఫ్ఏఓ.. గత సంవత్సరం రోమ్‌లో నిర్వహించిన అంత‌ర్జాతీయ స‌ద‌స్సులో వివిధ దేశాల్లో విజ‌య‌వంత‌మైన 20 వినూత్న వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌ను ప్ర‌జెంట్ చేశాయి, ఆ ప‌థ‌కాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన రైతు బంధు, రైతు బీమా స్కీమ్‌లు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

మనం ఎంత మంచి పనులు చేసినా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తూనే ఉంటారు, కానీ మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి తో ముందుకు వెళ్తుందని, మనం కలలు కన్న బంగారు తెలంగాణ కేవలం కెసిఆర్ నాయకత్వం వల్లే సాధ్యమని తెలిపారు. ఎన్నారైలుగా ఎలాగైతే ఉద్యమంలో మా వెంట ఉన్నారో నేడు బంగారు తెలంగాణ నిర్మాణం లో కూడా ముందుండి రాష్ట్రం లో పెట్టుబడులకు కృషి చేసి మీవంతు బాధ్యత నిర్వహించాలని కోరారు.

చివరిగా రోజు వారీగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఇంత చక్కటి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన టాక్ మరియు ఎన్నారై తెరాస కార్యవర్గానికి, ఆలాగే హాజరైన యూకే ప్రవాస సంఘాల ప్రతినిధులకు కృతఙతలు తెలిపారు.

టాక్ మరియు ఎన్నారై. టి.అర్.యస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. పునర్నిర్మాణం లో కూడా కెసిఆర్ వెంటే ఉంటామని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు పోచారం తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలను, నేడు స్పీకర్ గా రాష్ట్ర అసెంబ్లీని నడిపిస్తున్న తీరును సభకు వివరించారు. ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ కెసిఆర్ గారిచే “లక్షి పుత్రుడు” అని పిలుపించుకొనే మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నేడు లండన్ మన మధ్య ఉండడం చాలా సంతషంగా ఉందని. క్రమశిక్షణ కు మారుపేరుగా చేపట్టిన బాధ్యతలన్నింటిలో తనదైన ముద్ర వేసుకొని, రాష్త్ర ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న గోప్ప నాయకుడు పోచారం గారని తెలిపారు.

speaker pocharam

వారి తనయుడు పోచారం సురేందర్ రెడ్డి గారు లండన్ లో మాతో ఎన్నో ఉద్యమాలు చేసాడని, ఒక సామాన్య కార్యకర్తలాగా అన్ని కార్యక్రమాల్లో ముందుండి లండన్ వీధుల్లో జై తెలంగాణ అంటూ గులాబీ జెండా పట్టుకొని రాష్ట్ర సాధనోద్యమంలో క్రియాశీలకంగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, హాజరైన ప్రవాసులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ, ఉద్యమ సమయం లో పదవులకు ప్రాధాన్యతనివ్వకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉద్యమ నాయకుడు కెసిఆర్ గారితో కలిసి చేసిన పోరాటం వారి సుదీర్ఘ రాజకీయ జీవితం లో గొప్ప మైలు రాయిగా మిగిలిపోతుందని తెలిపారు.
ప్రజల పట్ల, రైతుల పట్ల వారికున్న బాధ్యత స్థానికంగా మేము బాన్సువాడ వెళ్ళినప్పుడు చూశామని, వ్యక్తిగతంగా మాకు బాన్సువాడ తో ప్రత్యేక అనుభందం ఉందని తెలిపారు.

ఎన్నారై తెరాస యూకే అడ్వైసరి బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, పోచారం గారు ఎంతటి నిరాడంబరుడో అంతటి కార్యదక్షుడని, గత ఎన్నికల్లో బాన్సువాడ ప్రచారానికి వెళ్ళినప్పుడు, మనం ఫిదా సినిమాలో చూసినట్టు ఎక్కడ చూసిన పచ్చదనం తో నిజయోజికవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ప్రజల్లో వారికున్న అభిమానం మాటల్లో చెప్పలేమని, కేవలం వారి సేవలు బాన్సువాడకు పరిమితం చేయకుండా, కెసిఆర్ గారు వారికి 2014 లో వ్యవసాయ మంత్రిగా నేడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు ఇవ్వడం మాకందరికి ఎంతో సంతోషం కలిగిందని తెలిపారు. చివరిగా వివిధ సంస్థల కార్యవర్గ సబ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి – పుష్ప దంపతులను సన్మానించి – జ్ఞాపిక బహూకరించారు.

ఈ కార్యక్రమంలో టాక్ మరియు ఎన్నారై టి.అర్.యస్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది , ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసారి , ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి మరియు శ్రీకాంత్ పెద్ది రాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, ఎన్నారై తెరాస యూకే అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, మరియు టాక్ & ఎన్నారై తెరాస కార్యవర్గ సభ్యులు మట్టా రెడ్డి, మల్లా రెడ్డి, సత్య చిలుముల, సృజన్ రెడ్డి చాడ, రమేష్ ఇస్సంపల్లి, శ్రీకాంత్ జెల్ల, సురేష్ బుడగం, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, సత్యపాల్ పింగిళి, రాకేష్ పటేల్, రవి రేతినేని, ప్రవీణ్ వీర, శుషుమ్నా రెడ్డి, క్రాంతి, జాహ్నవి, వంశీ పొన్నం, విజితా రెడ్డి , శైలజ, శ్వేతా మహేందర్, జస్వంత్ , సురేష్ గోపతి, ప్రశాంత్, గణేష్ పేస్తాం, అపర్ణ, స్వప్న, సుప్రజ పులుసు, అద్బుల్ జాఫర్, రామ్ కలకుంట్ల, అశోక్ అంతగిరి, రవి కిరణ్, వెంకీ, సత్య జిల్లా, నవీ భార్గవ్ కలకోటి మరియు తాల్ కార్యవర్గ సభ్యులు, ప్రతినిదులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -