రివ్యూ: మీకు మాత్రమే చెప్తా

889
meeku matrame chepta
- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం మీకు మాత్రమే చెప్తా. సమీర్ సుల్తాన్ దర్శకత్వంలో కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇప్పటివరకు దర్శకుడిగా తరుణ్,హీరోగా విజయ్‌ మంచి మార్కులు కొట్టేయగా ఈ సినిమాతో తరుణ్ హీరోగా మెప్పించాడా..?నిర్మాతగా విజయ్ ఎలాంటి సక్సెస్‌ను అందుకున్నాడో చూద్దాం..

క‌థ‌:

రాకేష్‌(త‌రుణ్ భాస్క‌ర్‌), కామేష్‌(అభిన‌వ్ గోమ‌టం) మంచి స్నేహితులు. ఓ టీవీ ఛానెల్‌లో ప‌నిచేస్తుంటారు. రాకేష్‌కి త‌ను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఫిక్స‌వుతుంది. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు రాకేష్ న‌టించిన ఓ ఆగిపోయిన సినిమాలో బూతు వీడియో ఒక‌టి ఆన్‌లైన్‌లో లీక్ అవుతుంది. దీంతో తన పెళ్లి ఎక్కడా ఆగిపోతుందో అన్న భయంలో రాకేష్ ఉంటాడు..?ఈ సమయంలో రాకేష్ స్నేహితులు ఏం చేశారు..? ఆ వీడియో అప్‌లోడ్ చేసిందెవ‌రు? వారిని ఎలా కనిపెట్టాడు…చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేదే మీకు మాత్రమే చెప్తా మూవీ కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కామెడీ,ఫస్టాఫ్. సినిమాకు ప్రధాన బలం తరుణ్ భాస్కర్. తన మేనరిజం,కామెడీ టైమింగ్,డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో తరుణ్ నటన ప్రొఫెషనల్ యాక్టర్‌ను గుర్తుచేస్తుంది. తరుణ్‌కు సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా చేసిన అభినవ్ గోమఠం ఆకట్టుకోగా సినిమా అంతా వీరిద్దరి భుజస్కందాలపైనే నడుస్తుంది. మిగితా నటీనటుల్లో అనసూయ,వాణి భోజన్‌,నవీన్,అవంతికా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్‌ స్క్రీన్ ప్లే,కథ. ఫస్టాఫ్‌ను కామెడీతో నడిపించినా సెకండాఫ్‌కు వచ్చే సరికి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌ ట్విస్ట్ ప్రేక్షకులు ముందే గెస్ చేయగలుగుతారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సమీర్ దర్శకత్వం బాగుంది. ఫస్టాఫ్‌లో చక్కటి వినోదాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు సమ్మీర్‌ సుల్తాన్ పనితనం కనిపించింది. శివకుమార్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. మ‌ద‌న్ గుణ‌దేవా కెమెరా వ‌ర్క్‌ బావుంది. ఎడిగింగ్ పర్వాలేదు. విజయ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

meeku Matrame Chepta

తీర్పు:

ఈ మధ్య కొత్త దర్శకులు ఫ్రెష్ కంటెంట్‌తో వస్తున్నారు. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కథలో అంతగా కొత్తదనం ఏమీలేనప్పటికీ కామెడీ ప్రధానంగా నడిపించే ప్రయత్నం చేశారు. తరుణ్ భాస్కర్ నటన సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్ మైనస్ పాయింట్‌. మొత్తంగా చూసుకుంటే ఇదో టైం పాస్ సినిమా.

విడుదల తేదీ:01/11/2019
రేటింగ్:2.5/5
న‌టీన‌టులు: తరుణ్ భాస్కర్, అనసూయ,వాణి భోజన్
సంగీతం: శివ‌కుమార్‌
నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
దర్శకత్వం: స‌మీర్ సుల్తాన్

- Advertisement -