ఇకపై మెడిసిన్స్‌ ‘డ్రోన్ డెలివరీ’

408
drone medicines
- Advertisement -

రోడ్డు ప్రమాదాల భారీన పడే బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రమాదం జరిగిన వెంటనే వైద్యసాయం అందించగలిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. కానీ వైద్యసాయం అందక…ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో భారీ ప్రమాదాలు జరిగినప్పుడు త్వరితగతిన వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. డ్రోన్ సాయంతో బాధితులకు వైద్యం అందేలా చర్యలు తీసుకునేందుకు హెల్త్ గ్లోబల్ నెట్‌,వరల్డ్ ఎకనామిక్,సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం, మందులు వంటివి ఆస్పత్రులకు చేరవేసేందుకు ‘డ్రోన్‌ డెలివరీ’ అనే ఆకాశమార్గంలో ప్రయాణించే విధానాన్ని రూపొందించింది.దేశంలో ఇలాంటి ప్రాజెక్టుకు తెలంగాణలోనే తొలిసారిగా అమలు చేయనున్నారు. ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

- Advertisement -