గద్దెలపై కొలువై..దివ్యదర్శమిస్తోన్న సమ్మక్క- సారలమ్మ

248
sammakka starts from chilakalagutta to medaram
- Advertisement -

గిరిజన పూజారుల పూజలు, డప్పు వాయిద్యాలు, నృత్యాల నడుమ.. సమ్మక్క తల్లి వనం నుంచి జనంలోకి తరలివచ్చింది. భక్తజన సందోహం మధ్య చిలకలగుట్టపై నుంచి బయల్దేరిన సమ్మక్క గురువారం (ఫిబ్రవరి-1) మేడారం గద్దెపైకి చేరింది. దీంతో మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది.

గిరిజన పూజారులు పూజలు నిర్వహించగా భారీ పోలీసు బందోబస్తుతో నడుమ సమ్మక్క గద్దెపైకి చేరుకుంది. మేడారంలో గద్దెలపై కొలువై భక్తులకు దివ్యదర్శనం ఇస్తోంది. సమ్మక్క- సారలమ్మ గద్దెలపై కొలువు దీరడంతో వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

sammakka starts from chilakalagutta to medaram

కాగా..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 11.30కి మేడారం చేరుకుంటారు. సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.50కి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసమేతంగా మేడారం చేరుకుని అమ్మలకు పూజలు నిర్వహిస్తారు. పోలీసు శిబిరంలో భోజనం చేస్తారు. ఉపముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సమావేశమై హైదరాబాద్‌ బయలుదేరుతారు.

- Advertisement -