డిసేబుల్డ్ అవేర్నెస్ వాక్‌ను విజ‌య‌వంతం చేయండి..

88
mayor bonthu

ప్ర‌పంచ విక‌లాంగుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని డిసెంబ‌ర్ 3వ తేదీన ఉద‌యం 7గంట‌ల‌కు న‌క్లెస్ రోడ్‌లో నిర్వ‌హించ‌నున్న డిసేబుల్డ్ అవేర్నెస్ వాక్‌లో పాల్గొనాల‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం త‌న కార్యాల‌యంలో డిసేబుల్డ్ అవేర్నెస్‌ వాక్ టీ-ష‌ర్ట్‌ను ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, అడిష‌న‌ల్ కమిష‌న‌ర్ సిక్తాప‌ట్నాయ‌క్‌, చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, ఆస్కి డైరెక్ట‌ర్ శ్రీనివాస‌చారి, విక‌లాంగుల హ‌క్కుల వేదిక సంఘం జాతీయ అధ్య‌క్షులు జ‌య‌హ‌రి అర్జున్‌, కో-ఆర్డినేట‌ర్ కొల్లి నాగేశ్వ‌ర‌రావు, ప‌రుశురాం త‌దిత‌రులు పాల్గొన్నారు.