విశాఖ టెస్టు…మయాంక్ అదుర్స్

587
mayank aggarwal
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ సేన పట్టుబిగించింది. 502 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ …బాల్‌తోనూ సఫారీలకు గట్టి షాకిచ్చింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కొల్పోయి 39 పరుగులు చేసింది. అశ్విన్ రెండు వికెట్లు తీయగా జడేజా ఒక వికెట్ తీశారు.ఎల్గర్ (27),బవుమా(2) క్రీజులో ఉన్నారు.

అంతకముందు తొలిరోజు ఓవర్ నైట్ స్కోరు 202 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు అదే జోరు కంటిన్యూ చేశారు. ఇక విశాఖ టెస్టు ద్వారా తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చిన ఘనత మయాంక్ అగర్వాల్‌కు దక్కింది.

ఈ ఘ‌న‌త‌ను అందుకున్న నాలుగ‌వ భార‌త క్రికెట‌ర్‌గా మ‌యాంక్ నిలిచాడు. 5 సిక్స్‌లు,22 ఫోర్లతో 215 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. కెరీర్‌లో తొలి సెంచ‌రీనే డ‌బుల్‌గా మ‌లిచిన ఇండియ‌న్ ప్లేయ‌ర్ల‌లో క‌రుణ్ నాయ‌ర్‌, వినోద్ కాంబ్లీ, దిలీప్ స‌ర్దేశాయి ఉన్నారు . టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన 86వ క్రికెట‌ర్‌గా అగ‌ర్వాల్ రికార్డు కెక్కాడు. తొలి వికెట్‌కు 317 ర‌న్స్ జోడించి 11 ఏళ్ల క్రితం సెహ్వాగ్‌-ద్రావిడ్‌లు నెలకొల్పిన 268 పరుగుల రికార్డును బ్రేక్ చేశారు.

- Advertisement -