కీవిస్‌తో పోరు…కోహ్లీ సేనకి సవాల్‌

296
india vs newzealand
- Advertisement -

గతేడాది ప్రపంచకప్‌లో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ సెమీఫైనల్లో కోహ్లీ సేనను ఓడించి వరల్డ్‌ కప్‌ నుంచి దూరం చేసిన న్యూజిలాండ్‌తో పోరాటికి సిద్ధమైంది టీమిండియా. గత ఆరు నెలలుగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి జట్లని మట్టికరిపించిన టీమిండియా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌ని దాని సొంతగడ్డపై సుదీర్ఘ సిరీస్‌లో ఢీకొట్టబోతోంది.

కీవిస్‌ టూర్‌లో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు జరుగనుండగా తొలి టీ20 అక్లాండ్ వేదికగా నేడు జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.20 గంటలకు మ్యాచ్ ప్రారంభకానుంది. అక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ పిచ్‌ బ్యాటింగ్‌కి ఎక్కువగా అనుకూలించనుంది. దానికి తోడు మైదానంలో బౌండరీ లైన్స్ దగ్గరగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం ఉండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

న్యూజిలాండ్‌తో సుదీర్ఘ సిరీస్‌లో గాయాల బెడద కూడా టీమిండియాలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కి దూరమవగా.. ఇషాంత్ శర్మ కూడా గాయంతో టెస్టులు ఆడటంపై అనుమానం నెలకొంది.

భారత టీ20 జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్

న్యూజిలాండ్ టీ20 జట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, స్కాట్ కుగ్లిజిన్, కొలిన్ మున్రో, కొలిన్ గ్రాండ్‌హోమ్, టామ్ బ్రూసీ, డార్లీ మిచెల్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), హమీశ్ బెనెట్, ఇస్ సోధి, టిమ్ సౌథీ, బ్లైర్ టింకర్

- Advertisement -