పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రామ్..

309
ram puri
- Advertisement -

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టించి ఇటివ‌లే విడుద‌లైన సినిమా హ‌లో గురు ప్రేమ కోస‌మే. ఇటివ‌లే రామ్ న‌టించిన సినిమాలు ఏవి అంత‌పెద్ద‌గా విజ‌యంసాధించ‌క పోవ‌డంతో నిరాశ‌లో ఉన్నారు రామ్ అభిమానులు. క‌లెక్ష‌న్ల ప‌రంగా బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాకు మాత్రం అంత పెద్ద‌గా క్రేజ్ రావ‌ట్లేదు. దింత త‌న త‌ర్వాతి మూవీపై ఎటువంటి డిసిష‌న్ తీసుకోలేదు రామ్.

ram

తాజాగా రామ్ కు సంబంధించి ఓ వార్త టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. రామ్ త‌న త‌ర్వాతి సినిమా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్నాథ్ తో చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇటివ‌లే పూరీ రామ్ క‌థ వినిపించాడ‌ని తెలుస్తుంది. ఆ క‌థ రామ్ కు న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. తాజాగా రామ్ తన కొత్త లుక్ స్టిల్ ను మాత్రం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

helo guru

పూరీ సినిమా కోస‌మే రామ్ ఈ ఢిఫ‌రెంట్ లుక్ ను చేయించుకున్నాడ‌ని స‌మాచారం. ఇక ద‌ర్శ‌కుడు పూరీకి కూడా హీట్ లేక చాలా కాలం అయింది. దింతో ఇద్ద‌రు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. పూరీ సినిమాల్లో హీరోకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రానున్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -