బుమ్రాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన కీవిస్ బౌలర్‌..!

460
guptil
- Advertisement -

భారత ఫాస్ట్ బౌలర్ జస్పిత్ బుమ్రాపై ఓ వైపు ప్రశంసలు గుప్పిస్తునే మరోవైపు హెచ్చరికలు పంపించాడు కీవిస్ బౌలర్ మార్టిన్ గుప్టిల్. తొలి రెండు టీ20ల్లో ఓటమిపై స్పందించిన గుప్టిల్….బుమ్రాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేయగలిగిన బౌలర్లలో బుమ్రా ఒకడని… బౌన్సర్లతో పాటు స్లో బంతుల్ని సంధించడంలో అతనికి తిరుగులేదన్నాడు. అయితే బుమ్రాకి మిగిలిన టీ20ల్లో ఇబ్బందులు తప్పవన్నారు.

రెండో టీ20లో పిచ్‌ చాలా మందకొడిగా మారిపోయింది. పిచ్‌ కారణంగానే మేము బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాం అన్నాడు. టాప్‌ ఆర్డర్ ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాల్సింది. కానీ పిచ్‌ సహకరించని కారణంగా సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం అన్నాడు.

- Advertisement -