రివ్యూ : మన్మథుడు 2

752
manmadhudu 2 Review

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. 17 ఏళ్ల క్రితం వచ్చిన ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ చిత్రం వచ్చింది. నటుడుగా తనకుంటూ ప్రత్యేక గుర్తంపు తెచ్చుకుని చి. ల. సౌతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీచంద్రన్‌… మన్మథుడు 2తో ఏ మేరకు ఆకట్టుకున్నాడు…?నాగ్‌ మన్మథుడిగా మరోసారి మెప్పించాడా లేదా చూద్దాం..

కథ:

ప్రేమలో విఫలం కావడంతో ఆగ్రహం చెందిన సాంబశివరావు ( అక్కినేని నాగార్జున ) ప్లే బాయ్ లా మారతాడు . కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తుంటాడు. ఏజ్ బార్ అవుతుండటంతో కుటుంబసభ్యులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తారు. దీంతో అవంతిక ( రకుల్ ప్రీత్ సింగ్ )తో కలిసి తన పెళ్లి చెడగొట్టే పనులు మొదలు పెడతాడు . అయితే ఈ క్రమంలో కథ ఎలాంటి మలుపు తిరిగింది…?చివరికి నాగ్‌…రకుల్ ప్రేమలో ఎలా పడ్డాడు..?కథ ఎలా సుఖాంతం అవుతుందనేది తెరమీద చూడాల్సిందే.

Image result for మన్మథుడు 2 రివ్యూ

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్‌ నాగార్జున,కథ,కామెడీ,విజువల్స్‌. తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేశాడు నాగార్జున. వయసు పెరుగుతున్న నవ మన్మథుడిగా తెరపై అదరగొట్టాడు. ముఖ్యంగా నాగ్‌-రకుల్ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌. ఇక సినిమాకు మరో ప్లస్ పాయింట్ వెన్నెల కిషోర్ కామెడీ. సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది రకుల్‌. మిగిలిన పాత్రల్లో రావు రమేష్,దేవ దర్శని మెప్పించగా సమంత,కీర్తి సురేష్‌ స్పెషల్ అప్పియరెన్స్‌ సూపర్బ్.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు,క్లైమాక్స్‌. ఫ్రెంచి మూవీ రిమేక్‌గా తెరకెక్కగా తెలుగు నేటివిటి మిస్సవడం మరో మైనస్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. మూవీని ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు రాహుల్ రవీచంద్రన్‌. పాటలు బాగున్నాయి. సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for మన్మథుడు 2 రివ్యూ

తీర్పు:

టీజర్, ట్రైలర్, సాంగ్స్‌, ప్రమోషన్స్‌తో ‘మన్మథుడు 2’ చిత్రానికి పాజిటివ్ బజ్ ఏర్పడింది. నాగ్ నటన,కామెడీ సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్‌ మైనస్‌. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అందరిని అలరించే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ మన్మథుడు 2.

విడుదల తేదీ:09/08/2019
రేటింగ్: 2.5/5
నటీనటులు: నాగార్జున,రకుల్ ప్రీత్
సంగీతం:చేతన్ భరద్వాజ్
నిర్మాత:అక్కినేని నాగార్జున
దర్శకుడు: రాహుల్ రవీచంద్రన్‌