మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..

491
Revanth Reddy.jpeg
- Advertisement -

మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనమా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖకు రాహుల్ గాంధీకి పంపించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ పదవిలో కొనసాగాలని పార్టీకి చెందిన పలువురు నేతలు విన్నవించినా కూడ రాహుల్ మాత్రం పట్టు వీడడం లేదు.

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్ధాయి నుంచి బలోపేతం చేయాలని భావిస్తోంది అధిష్టానం. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టాలని చాలా మంది కోరుతున్నా అతను మాత్రం అస్సలు వినడం లేదు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు. తెలంగాన నుంచి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు రాజీనామాలు చేశారు.

- Advertisement -