సింధుతో పెళ్లిచేయండి… కలెక్టర్‌కు వృద్ధుడి విన్నపం..!

603
pv sindhu
- Advertisement -

వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధుతో తనకు పెళ్లిచేయాలని ప్రజా దర్బార్‌లో విన్నవించాడు ఓ 70 ఏళ్ల వృద్ధుడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కలెక్టర్ వీరరాఘవరావు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా, 70 ఏళ్ల మలైసామి అనే వృద్ధుడు కూడా వినతిపత్రంతో హాజరయ్యాడు.

వృద్ధుడి వినతిపత్రాన్ని చూసిన ఆ కలెక్టర్ షాకయ్యాడు. తనకు పీవీ సింధుతో పెళ్లి చేయాలని కోరాడు. తాను 2004లో జన్మించానని, తాను దేవుడి ప్రత్యేక అవతారాన్నని, దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించానని అందులో పేర్కొన్నాడు.

ఆ లేఖలో తన ఫొటో పక్కనే సింధు ఫొటో అంటించిన మలైసామి…ఆమెను పెళ్లి చేసుకునేందుకు సహకారం అందించాలని, కుదరకపోతే కిడ్నాప్ చేసైనా పెళ్లాడతానని పేర్కొన్నాడు. ఆ వృద్ధుడు చేసిన పనితో అక్కడున్న వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోగా ప్రస్తుతం ఈ వార్త తమిళనాట వైరల్‌గా మారింది.

- Advertisement -