‘సైరా’ మేకింగ్‌ వీడియో వచ్చేసింది..

206
Sye Raa

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ మూవీని మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మేకింగ్‌ వీడియో విడుదలైంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్క రోజు ముందుగా ఈ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. సెట్‌లో జరిగిన సంఘటనల్ని పంచుకుంది.

భారీ సెట్ల నిర్మాణం.. యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసిన తీరు.. కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసిన విధానం.. ప్రధాన పాత్రధారులకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ.. ఆంగ్లేయులపై నరసింహా రెడ్డి తిరుగుబాటు.. ఇరువర్గాలకి చెందిన పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరిగిన తీరును ఈ మేకింగ్ వీడియోలో చూడోచ్చు.

చిత్రీకరణ ఏ స్థాయిలో జరిగిందనడానికి ఈ మేకింగ్ వీడియో అద్దం పడుతోంది. సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. మెగా అభిమానులకు మరో కానుకగా ఈ నెల 20న టీజర్ ను వదలనున్నారు.ఇక ఈ సినిమాకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేశారు. వివిధ భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో నటించారు. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.