అప్పడు కాజల్, ఇప్పుడు తమన్నా…ఎంటీ ఛోటా ఇది

376
Chota k naidu Kissing Tamannha And Kajal
- Advertisement -

ఛోటా కే నాయుడు టాలీవుడ్ లో ప్రముఖ కెమెరామెన్ గా గుర్తింపు పొందాడు. తెలుగులో చాలా పెద్ద సినిమాలకు ఆయన కెమెరామెన్ గా పనిచేశారు. సినిమాను అందంగా తెరకెక్కించడంలో ఛోటా కే నాయుడు దిట్ట అని చెప్పుకోవచ్చు.. అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా ఆయనకు చాలా ఫాలోయింగ్ ఉంది. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, యాక్టర్లు ఆయనకు చాలా క్లోజ్. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఆయన ఓ వివాదంలో ఇరుక్కున్నారు.

ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కాజల్ కు అందరి ముందే ముద్దు పెట్టేశాడు. సోషల్ మీడియాలో ఈవిషయం చాలా వైరల్ అయింది. అయితే తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు ఛోటా కే నాయుడు. రాజుగారి గది సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో తమన్నా చేయిని గట్టిగా పట్టుకున్నాడు ఛోటా. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్లతో ఛోటా కే నాయుడు ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

- Advertisement -