బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మహేశ్ విట్టా

293
mahesh-vitta

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ గేమ్ షో విజయవంతంగా కొనసాగుతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 3కి అద్బుతమైన స్పందన వస్తోంది. కాగా ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగుగు సభ్యులు వరుణ్, శ్రీముఖి, శివజ్యోతి, అలీ రెజా, బాబా భాస్కర్, రాహుల్ లు ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఈ వీక్ లో ఎలిమినెట్ కానున్నారు. మిగతా ఐదుగురు సభ్యుల్లో ఎవరో ఒకరు విజేత గా నిలవనున్నారు.

కాగా ఇటివలే ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు చివరి వారం ఎలిమినెట్ అయిన మహేశ్ విట్టా. హీరో నాని వల్లే తాను బిగ్ బాస్ షో కు వచ్చానని తెలిపారు. వాస్తవానికి హౌస్‌లో ఏం జరుగుతుందనే పూర్తి విషయాలు నాగార్జున గారికి కూడా తెలియనివ్వరు. వారు ఇచ్చిన స్క్రిప్ట్‌ని మాత్రం ఆయన ఫాలో అవుతారు. ఆయన కూడా ఎవ్వరినీ బలవంతంగా తిట్టే వ్యక్తి కాదన్నారు.

ఓట్ల ప్రకారంగా బిగ్ బాస్ 3 విన్నర్ గా రాహుల్ నిలుస్తాడని..లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే మాత్రం శ్రీముఖి గెలుస్తుందని చెప్పాడు. పునర్నవి, రాహుల్, నేను, వితిక, వరుణ్‌ ఫ్రెండ్స్‌. మా మధ్య సరదా సంఘటనలు జరిగాయి. రాహుల్ పునర్ణవి మధ్యలో ఏం లేదని.. అసలు లోపల వారిద్దరి మధ్యలో ఏం జరగలేదని ఎడిటింగ్ లో అలా చూపించారన్నారు.