మహర్షి మూవీలో మహేష్‌ మరో లుక్‌..

274
- Advertisement -

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ‘భరత్‌ అనే నేను’సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ బాబు అప్‌ కమింగ్‌ మూవీ ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. దీని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నారు.

మహేష్‌ బాబు న్యూ లుక్‌ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చంది. మహేష్‌ నటిస్తున్న 25 వ సినిమాలో ప్రధానాంశంగా రైతు సమస్యలని ఫోకస్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో మూవీ పై అంచాలను రెట్టింపు అయింది.

ప్రస్తుతం ఈ చిత్రం నుండి మహేష్ మరో లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీ కోసం మహేష్ గ్యాప్ లేకుండా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మహేష్‌ అభిమానులతో కలిసి దిగిన ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీతో కలిసి జర్మనీలో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కుడా నటిస్తున్న విషయం తెలిసిందే

- Advertisement -