యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మహేష్‌ కూతురు..!

90
sitara

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కుమార్తె సితార యూట్యూబ్‌లో ఓ ఛానల్ ప్రారంభించింది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్యతో సితార‌ యాట్యూబ్ వేదిక‌గా సంద‌డి చేసింది. ఈ ఛానల్ పేరు ‘ఏ అండ్ ఎస్’. ఇందులో ‘ఏ’ అంటే ఆద్య… ‘ఎస్’ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు. మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియో రూపొందించారు.

mahesh

ఈ వీడియోలో వారు చేస్తున్న సంద‌డి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. యూట్యూబ్‌లో ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. అయితే వారిద్ద‌రు క‌ల‌సి సంద‌డి చేసిన యూ ట్యూబ్ వీడియోని మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేస్తూ.. ఆ పిల్ల‌లిద్ద‌రికి బెస్ట్ విషెస్ అందించారు. అంతేకాదు యూ ట్యూబ్ వేదిక‌గా వారు చేసిన ఫ‌ర్‌ఫార్మెన్స్‌ని ఎంజాయ్ చేయండని కూడా తెలిపాడు.