ఈ ఆనందాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.. మ‌హేష్‌

50

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందిన భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా దూసుకెళుతోంది.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం `మ‌హ‌ర్షి` యూనిట్ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌ను సంద‌ర్శించింది. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, అల్ల‌రి న‌రేష్‌, పూజా హెగ్డే త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahesh Babu

ఈ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మాట్లాడుతూ – “సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌కు వ‌చ్చి చాలా ఏళ్ల‌య్యింది. ఆరోజుల‌ను నేను మ‌రచిపోలేను. మురారి సినిమాను ఇదే థియేట‌ర్‌లో నేను చూసిన‌ప్పుడు నాన్న‌ నా భుజంపై చెయ్యి వేశారు. ఆరోజును నేను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. అంద‌రికీ తెలిసిందే. ఎ.ఎం.బి.సినిమాస్‌లో నేను పార్ట్‌న‌ర్ అయ్యి మ‌ల్టీప్లెక్స్ ఓపెన్ చేశాం. ఆ థియేట‌ర్ ఉన్నా.. ఈ సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌నే నా స్వంత థియేట‌ర్‌గా భావిస్తాను. ఎందుకంటే నా కెరీర్ అలాంటి సినిమాలు ఇక్క‌డ రిలీజ్ అయ్యాయి.

నా 25వ సినిమా మ‌హ‌ర్షి కూడా ఇక్క‌డ రిలీజ్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ థియేట‌ర్‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే నాపై ఉండాలి. నా 25 సినిమాల కెరీర్‌లో ఈరోజు పొందిన ఆనందాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. మీ అంద‌రి కోసం మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేస్తున్నాను“ అన్నారు.