డాటర్స్ డే.. మహేశ్ బాబు ఆసక్తికర ట్వీట్

198
Mahesh Babu Daughter

డాటర్స్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కూతురు పై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఈసందర్భంగా మహేశ్ తన ట్వీట్టర్ ద్వారా తన కూతురికి డాటర్స్ శుభాకాంక్షాలు తెలిపారు. నువ్వు నా ప్రియ‌మైన కొంటె కూతురివి. నిన్ను ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటాను. జీవితంలో అత్యంత ఎత్తుకి ఎద‌గాలని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను అని మ‌హే్ పేర్కొన్నారు.

మరోవైపు మహేష్ సతీమణి నమ్రత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సితారకు డాటర్స్ డే విషెస్ తెలిపారు. ఆమె కూడా ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. సితారకు ‘డాటర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో వెలుగు దివ్వెవు నువ్వు. నా ఆకాశంలో ప్రతిక్షణం మెరుస్తుండే చిన్ని తారవు నువ్వు. నా ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా మార్చావు. లవ్‌ యూ సితార.’ అని నమ్రతా ట్వీట్ చేశారు.

ఇక సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సితార చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన సితార అందులో తన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ప్ర‌స్తుతం ఆయ‌న స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ 2020సంక్రాంతికి విడుదల కానుంది.