మహేష్‌ ‘సర్కారు వారి పాట’ అదిరింది..

708
Mahesh
- Advertisement -

టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న 27వ చిత్రంగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు మ‌హేష్ ప్రీ లుక్ విడుద‌ల చేశారు. స‌ర్కారు వారి పాట అనే టైటిల్‌ని చిత్రానికి ఖరారు చేయ‌గా, పోస్ట‌ర్‌లో మ‌హేష్ చెవిపోగుతో క‌నిపిస్తున్నారు. మెడ‌పై రూపాయి కాయిన్ బొమ్మ ఉండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది.

‘సర్కారు వారి పాట’ టైటిల్ యునీక్‌గా, సూపర్బ్‌గా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటనతోనే మహేష్‌ బాబు సినీ కెరీర్‌లో మరో హిట్ పడిపోయిందని అంటున్నారు. ‘మరో హ్యాట్రిక్ కోసం బ్లాక్ బస్టర్ మొదలు’ అంటూ ఈ పోస్టర్‌పై మహేష్‌ బాబు కామెంట్ పెట్టారు.

ఇక ఫ్యాన్స్ అయితే, ‘మాసివ్ మేకోవర్ లోడింగ్… ఒక్కొక్కడికీ గజం దింపుదాం అన్నా’ అని, ‘ఇక థియేటర్లలో పొర్లు దండాలే’ అని కామెంట్లు పెడుతున్నారు. మహేష్‌ పెట్టిన ట్వీట్ ఇప్పటికే దాదాపు 20 వేల రీట్వీట్లను, 6 వేల కామెంట్లను, 52 వేల లైక్ లను సాధించి దూసుకెళుతోంది.

మైత్రిమూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థ‌లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. క‌థానాయిక‌గా కైరా అద్వానీని ఎంపిక చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. థ‌మన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -