“సరిలేరు నీకెవ్వరు”..రివ్యూ & రేటింగ్

1441
sarileru Nikevaru Review
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో ఎకె ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. విజయశాంతి, ప్రకాశ్ రాజ్ , బండ్ల గణేశ్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను మహేష్ బాబు మెప్పించాడా అని తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం.

Sarileru

కథః
మహేశ్ బాబు (అజయ్ ) ఎవరు లేని అనాథ. అజయ్ ఆర్మీలో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓ ఆపరేషన్‌లో తన తోటి జవాను గాయపడటంతో అతడి బాధ్యతలను తీర్చడానికి అజయ్ కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. కర్నూలులో అడుగు పెట్టిన మరుక్షణమే తన తోటి జవాను తల్లి, ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) ఓ సమస్యలో కూరుకుపోవడం అజయ్ తెలుసుకొంటాడు. మంత్రి నాగేంద్ర (ప్రకాశ్ రాజ్) ప్రైవేట్ సైన్యం అజయ్‌ను టార్గెట్‌గా చేసుకొంటుంది. ఓ విషయంలో ఇద్దరికి గొడవ కావడంతో భారతి కుటుంబం ప్రాణాల మీదకు వస్తుంది. ఆ సమయంలో ఆర్మీ నుంచి భారతి కొడుకు చనిపోయిన విషయాన్ని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉంటాడు అజయ్. ఈ క్రమంలోనే వచ్చే దారిలో రష్మిక (రష్మిక మందన్న) బ్యాచ్ కలుస్తుంది. అసలు వీళ్లెవరు.. అజయ్ ఆర్మీ నుంచి వచ్చి భారతి కుటుంబానికి ఎలా అండగా ఉంటాడు అనేది అసలు కథ.

 Sarileru Nikevaru Rashmika
ప్లస్ పాయింట్స్ః
అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ అని ఆయన గత సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. ఈసినిమాను కూడా అదే ఫార్మాట్ లో రాసుకుని పక్కాగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు అనిల్. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ సీన్ నుంచి చివరి వరకు మహేష్ ఎనర్జీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు మహేశ్ ప్రాణం పెట్టి చేశాడని చెప్పాలి. అప్పటి వరకు యాక్షన్ సినిమా చూసిన ప్రేక్షకులను కామెడీ వైపు మళ్లించాడు అనిల్. అరగంటకు పైగానే బాగానే నవ్వించాడు. ఎక్కడా డ్రాప్ అవ్వకుండా నాన్ స్టాప్ కామెడీ పంచులతో పిచ్చెక్కించాడు అనిల్ రావిపూడి. సంగీత, రష్మిక, బండ్ల గణేష్ బ్యాచ్‌తో కలిసి మహేష్, రాజేంద్ర ప్రసాద్ కూడా కుమ్మేసారు. అబ్బాబాబాబా అంటూ సూపర్ స్టార్ చెప్పిన ఒక్క డైలాగ్ థియేటర్స్‌‌లో నవ్వులు పూయించింది. సెకండాఫ్ అంతా విజయశాంతి కోణంలోనే సాగుతుంది. ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అనిల్. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ఇంటికి వచ్చే సీన్ మహేష్ హీరోయిజంతో పాటు విజయశాంతిలోని నటికి కూడా చాలా పని చెప్పింది. ఫైట్లు కూడా బాగున్నాయి. విజయశాంతి, మహేష్ మధ్య డిజైన్ చేసిన సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే విజయశాంతి కుమ్మెసింది. ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్ లు ఆకట్టుకున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. కశ్మీర్ అందాలతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా చూపించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. విజువల్‌గా మైండ్ బ్లాక్ పాట చాలా బాగా కుదిరింది.

sarileru Nikevaru
మైనస్ పాయింట్స్ః
ఈసినిమాలో మైనస్ పాయింట్స్ పెద్దగా లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే మహేశ్ బాబు కామెడీ, ఎమోషనల్, రోమాన్స్ అన్ని కవర్ చేశాడు. ఇక ఈసినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ అంటే ఇందులో పెద్దగా కథ లేకపోవడం. ఉన్న కథను కామెడీతో సాగదీశాడు దర్శకుడు. కానీ ఎక్కడ బోర్ కొట్టించలేదు. ఫస్ట్ ఆఫ్ లో అసలు కథలోకి ఎంట్రీ ఇవ్వలేదు. పైగా సెకాండాఫ్ లో కూడా కథను లెంగ్తీగా ఉండటం ప్రేక్షకులకు కాస్త బోరింగ్ అనిపించింది.
తీర్పు:
దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన బలాన్ని చూపించాడు. వినోదంతో పాటు యాక్షన్ కూడా నింపి పక్కా కమర్షియల్ సినిమా ఇచ్చాడు. రొటీన్ కథే అయినా కూడా అభిమానులను మెప్పించేలా తెరకెక్కించడంలో ఈ కుర్ర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు తో మరోసారి కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు మహేశ్ బాబు.

విడుదల తేదీ: 11/01/2020
రేటింగ్:2.75/5
నటీనటులు: మహేశ్‌బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత,హరితేజ
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు
దర్శకత్వం: అనిల్ రావిపూడి

- Advertisement -