చంద్రయాన్-2 సైంటిస్టులకు మహేష్ సెల్యూట్

134
mahesh-babu

భారత్‌ తలపెట్టిన చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ సాంకేతిక సమస్యతో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి కొద్ది ఎత్తులో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో యావత్‌ భారతావని దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ ప్రయోగం విఫలమైనా ఇస్రో శాస్త్రవేత్తల కృషికి, పనితీరుకు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శాస్త్రవేత్తలకు ప్రశంసలు అందుతున్నాయి.

mahesh

తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ఇస్రో సైంటిస్టులకు బాసటగా నిలిచారు. ఆయన ఇస్రో సైంటిస్టులకు సెల్యూట్ చేశారు. “మీరే మా నిజమైన కథానాయకులు. మీ వెంటే మేమున్నాం. మీలో ప్రతి ఒక్కరికీ వందనం చేస్తున్నా. ఇది మీ విజయగాథకు ఆరంభం మాత్రమే. మున్ముందు మరెంతో సాధించాల్సి ఉంది” అంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు తన మహర్షి చిత్రంలోని పాప్యులర్ డైలాగును కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. “విజయం ఓ గమ్యం కాదు, అదొక ప్రయాణం (సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఏ జర్నీ)” అంటూ సైంటిస్టులకు ప్రోత్సాహ వచనాలు పలికారు.