వంశీ పైడిపల్లికి షాక్…విజయ్ దర్శకుడితో మహేశ్

197
Vamshi paidipalli Parashuram

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ . సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఈమూవీ తర్వాత వంశీ పైడిపల్లితో మహేవ్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కథను సిద్దం చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. తాజాగా మూవీకి సంబంధించి మరో వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మహేశ్ బాబు ఈమూవీకి పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. వంశీ చెప్పిన కథలో మహేశ్ కొన్ని మార్పులు చేయమని చెప్పాడట. అందుకు వంశీ అంగీకరించపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తుంది.

ఇదే కథతో వేరే హీరోతో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడట దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇక మహేశ్ బాబు విషయానికి వస్తే గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్ ఎప్పటి నుంచే మహేశ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. వంశీతో సినిమా క్యాన్సల్ కావడంతో వెంటనే పరశురామ్ కు ఒకే చెప్పేశాడట మహేశ్ బాబు. పరశురామ్ ప్రస్తుతం నాగచైతన్య తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోంది. దీనికి నాగేశ్వరరావు అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.