జవాన్లతో రిపబ్లిక్ డే వేడుక జరుపుకున్న మహేష్‌..

70
mahesh

సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` ఈ చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. నేడు 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమా బృందంతో కలిసి మహేశ్ బాబు జవాన్లను కలిశారు. నటి విజయ శాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఆయనతో ఉన్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ జవానుగా కనపడిన విషయం తెలిసిందే.

తాజాగా, జవాన్లతో కలిసినప్పుడు తీసుకున్న ఫొటోలను మహేష్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని మహేష్‌ అన్నారు. తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుల్లో ఈ రోజు కూడా నిస్సందేహంగా ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. మనల్ని ప్రతిరోజు కాపాడుతున్న భారత హీరోలకు (జవాన్లకు) సెల్యూట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.