మహేశ్ కూతురు క్యూట్ డ్యాన్స్ (వీడియో)

188
sitara-dance

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆయన కూతురు సితారకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార పాట పాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు చూసి మహేశ్ అభిమానులు సంబురపడిపోతుంటారు. ఇటివలే సితార ఒక యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించింది. A&Sఅనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పోస్ట్ చేస్తుంది.

వంశీ పైడిపల్లి కూతరు ఆధ్యా, సితార పేరు మీద ఛానల్ ను ప్రారంభించారు. మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు.

ఈ వీడియోలో వీరిద్దరి సంభాషణకు అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా సితార మరో వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ బాబు పాటకు అద్భుతమైన డ్యాన్స్ చేసింది. మ‌హ‌ర్షి చిత్రంలోని పాల‌పిట్ట‌… అనే సాంగ్‌కి అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఈవీడియోను మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో మీకోసం..