నువ్వు ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నా సితారః మహేశ్ బాబు

89
Mahesh babu Sitara

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఇద్దరు సంతానం అన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. కూతురు సితార అంటే మహేశ్ బాబుకు చాలా ఇష్టం. నేడు మహేశ్ బాబు కూతురు సితార పుట్టిన రోజు. నేటితో ఆమె ఆరు సంవత్సారాలు పూర్తీ చేసుకుని 7వ సంవత్సరంలోని అడుగుపెట్టింది. మహేశ్ బాబు ఎంత ఫేమస్ ఓ ఆయన కూతురు కూడా అంతే ఫేమస్. సోషల్ మీడియాలో సితారకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

సితార పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. ఈసందర్భంగా మహేశ్ బాబు తన కూతురు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షాలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే సితార.. కాలం చాలా వేగంగా గడిచిపోతోంది. నీతో గడిపిన ప్రతీ క్షణం నాకు చాలాచాలా ప్రత్యేకం. నువ్వు జీవితాంతం సుఖసంతోషాలతో, సానుకూలతతో ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ఊహించలేనంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని ట్వీట్ చేశారు మహేశ్ బాబు.