వరల్డ్ కప్ మ్యాచ్ లకు తెలుగు హీరోలు..

55
Mahesh Babu Venkatesh.jpeg

నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సామన్య ప్రజలే కాకుండా సెలబ్రెటీలు కూడా ఈమ్యాచ్ ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 10 దేశాల మధ్య జరిగే ఈటోర్నిని లైవ్ లో చూసేందుకు రెడీగా ఉన్నారు టాలీవుడ్ హీరోలు . హీరోలు వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నిర్మాత సురేష్‌ బాబు, వారితోపాటు డా.కామినేని శ్రీనివాస్‌, ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, చంద్ర‌కుమార్‌ల‌ు కూడా విదేశాలకు వెళ్తున్నారు.

ఛాముండేశ్వర్ నాథ్ నేతృత్వంలో వీరంతా ఇంగ్లాండ్ కు వెళ్లనున్నారు. మే 30నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జూన్ 9 న్యూజిలాండ్, జూన్ 13న ఆస్ట్రేలియా, జూన్ 16న యపాకిస్ధాన్ తో ఇండియా ఆడనుంది. ఈమూడు మ్యాచ్ లను చూడాలని వారు నిర్ణయించుకున్నారట. విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని మనకు తెలిసిందే. మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే వెంకటేశ్ వెంకీమామ సినిమాలో నటిస్తున్నారు.