ధోని ఖాతాలో మ‌రో రికార్డు…

296
Mahendra Singh Dhoni Becomes Fifth Indian To Score 6000 Runs In T20s
- Advertisement -

టీం ఇండియా మాజీ కెప్టెన్  మ‌హెంద్ర సింగ్ ధోని మ‌రో అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. సూప‌ర్ కూల్ కెప్టెన్ గా పేరున్న ఇత‌నికి ఆట‌లో లో ట్రిక్ ల‌ను పాటించ‌డంతో పాటు బ్యాటింగ్ లో కూడా పరుగుల వ‌ర‌ద కొన‌సాగిస్తున్నాడు. టీ20 క్రికెట్లో ధోని మొత్తం 6 వేల‌కు పైగా ప‌రుగులు సాధించాడు. ఐపీఎల్‌లో భాగంగా దిల్లీ డేర్‌డెవిల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనతను ద‌క్కించుకున్నాడు.
Mahendra Singh Dhoni Becomes Fifth Indian To Score 6000 Runs In T20s

భార‌త‌దేశంలో ఈప‌రుగులను దాటిన ఐద‌వ ఆట‌గాడు ధోని. ధోని ప‌ని అయిపోంద‌నున్న వాళ్ల అంద‌రికి బ్యాటింగ్ తో త‌న స‌త్తా ఎంటో చూపిస్తున్నాడు. ఇక ఐపిఎల్ లో ధోని చైన్నై టీంకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ విష‌యం తెలిసిందే. త‌న‌మైండ్ గేమ్ తో చైన్నై టీంను వ‌రుస విజ‌యాల‌తో ముందుకు తీసుకుకెళ్తున్నాడు. మొద‌ట్లో వ‌రుస‌గా ఓట‌మి పాలైన చైన్నై టీం.. ఇప్ప‌డు వ‌రుస విజ‌యాల‌తో పాయింట్ల పాట్టిక‌లో రెండ‌వ‌స్ధానంలో నిలిచింది. నిన్న జ‌రిగిన ఢిల్లి వ‌ర్సెస్ చెన్నై మ్యాచ్ లో ధోని చేసిన ప‌రుగ‌ల‌తో టీ20 మ్యాచ్ ల‌లో 6వేల పైగా ప‌రుగుల చేసిన ఇండియా క్రికెట‌ర్ గా నిలిచాడు.

Mahendra Singh Dhoni Becomes Fifth Indian To Score 6000 Runs In T20s

టీ20 6వేల పైగా ప‌రుగులు చేసిన ఇండియా ప్లేయ‌ర్ల‌లో సురేష్ రైనా (7,708) ప‌రుగులు చేసి మొద‌టి స్ధానంలో ఉన్నారు. రెండ‌వ ప్లేస్ లో విరాట్ కోహ్లి(7,621), మూడ‌వ ప్లేస్ లో రోహిత్ శ‌ర్మ‌(7,303), నాల్గ‌వ ప్లేస్ లో గౌత‌మ్ గంభీర్ (6,402) ప‌రుగులు చేశారు. ఇక తాజాగా ధోని కూడా ఇ లిస్ట్ లో చేరిపోయారు. ఇక ఐపిఎల్ మ్యాచ్ ల‌లో ధోని మ‌రో రికార్డు సొంతం చేసుకోనున్నాడు. ఐపిఎల్ లో మ‌రో 26 ప‌రుగులు సాధిస్తే 4వేల ప‌రుగుల క్ల‌బ్ లో చేరిపోతారు. ఇప్ప‌టివ‌ర‌కూ ధోని ఐపిఎల్ లో 3,974 ప‌రుగులు చేశాడు.

- Advertisement -