మహర్షి..ఎపిక్ బ్లాక్ బస్టర్

89
maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం మహర్షి. విడుదలైన ప్రతిచోటా వసూళ్ల సునామీ సృష్టిస్తూ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. కేవలం నాలుగురోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ వందకోట్ల క్లబ్‌లో చేరారు మహేష్‌. శ్రీమంతుడు,భరత్‌ అనే నేనుతో వందకోట్లు కొల్లగొట్టిన మహేష్‌…మహర్షితో సునామీ సృష్టించాడు.

మహర్షి మూవీని ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అభివర్ణించింది. విడుదలైన వారం రోజుల వ్యవధిలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన మహేష్ బాబు తొలి చిత్రం మహర్షి అని ట్వీట్ చేసింది.అయితే ఆ గ్రాస్ వసూళ్లు ఎంతో వెల్లడించలేదు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి ఆరు రోజుల్లో మహర్షి రూ.56.54 కోట్ల షేర్ వసూలు చేసింది. తొలిరోజు రూ.24.67 కోట్లు, రెండో రోజు రూ.7.96 కోట్లు, మూడో రోజు రూ.8.01 కోట్లు, నాలుగో రోజు రూ.8.25 కోట్లు, ఐదో రోజు రూ.4.2 కోట్లు, ఆరో రోజు రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఇక యూఎస్‌లో కూడా సత్తాచాటాడు మహర్షి. మొత్తంగా మహర్షితో అద్భుతమైన మెసేజ్ ఇవ్వడమే కాదు తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి సత్తా చాటాడు మహేష్‌.