మహా సీఎంతో కలిసి మేడిగడ్డ చేరుకున్న గవర్నర్

203
fadnavis

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌,గవర్నర్ నరసింహన్  మేడిగడ్డకు చేరుకున్నారు. వీరిద్దరికి సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. అంతకముందు బేగంపేట విమానాశ్రయంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు స్వాగతం పలికిన సీఎస్ ఎస్కె జోషి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఘనస్వాగతం పలికారు.

అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం ఫడ్నవిస్ తో కలిసి గవర్నర్ నరసింహన్, సీఎస్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కాళేశ్వరం బయలుదేరారు.

అంతకముందు మేడిగడ్డ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్‌తో పాటు మంత్రులు స్వాగతం పలికారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.

ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్‌లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొంటారు. సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అనంతరం 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం పంచుకున్న ఇంజనీర్లు, ఏజెన్సీలు, సహకారం అందించిన బ్యాంకర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.