ఎటూ తేలని మహా రాజకీయం..!

360
Maharashtra Live Updates

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. 50-50 ఫార్ములాలో భాగంగా తొలుత సీఎం ఛాన్స్‌ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న శివసేన వెనక్కితగ్గడం లేదు. ఫలితం వచ్చి 10 రోజులు గడుస్తున్న సీఎం పదవి ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

శివసేన 50-50 ఫార్ములాకు ఎట్టి పరిస్ధితుల్లో ఒప్పుకునేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో మహారాష్ట్రలో మళ్లీ ఎన్నికలు తప్పవా అనే సందేహం అందరిలో నెలకొంది.

మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని భావించిన శివసేన ఆశలపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నీళ్లు చల్లారు. తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం దీర్ఘకాల పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేయలేమని సోనియా అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది.

ప్రతిపక్షంలో కూర్చోవాలని ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాలని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. బీజేపీతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మొండికేస్తే మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి కూడా అభ్యంతరం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందో వేచిచూడాలి.