రేపే ఫడ్నవీస్‌కు బలపరీక్ష…సుప్రీం

583
fadnavis
- Advertisement -

సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించిన మహారాష్ట్ర ఎపిసోడ్‌పై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. బీజేపీకి షాకిస్తూ.. సీఎం ఫడ్నవీస్‌ను రేపు బలపరీక్షకు ఆదేశించింది సుప్రీం. సాయంత్రం 5 గంటలలోపు ఫడ్నవీస్ బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని …ప్రొటెం స్పీకర్‌ని వెంటనే నియమించాలని సూచించింది.బలనిరూపణ కంటే ముందే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని తెలిపింది.

జస్టిస్‌లు ఎన్వీ రమణ, అశోక్ భూషణ్, సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్, బీజేపీ, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, కేంద్రం, గవర్నర్ కార్యదర్శి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కూటమి తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు.

మరోవైపు శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలతో కలిసి బల ప్రదర్శన నిర్వహించాయి. తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని మహా వికాస్ ఆఘాడీ పేర్కొంది. ఎమ్మెల్యేలందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కూటమి నేతలు బీజేపీ ప్రలోభాలకు తలొగ్గమని ప్రతిజ్ఞ చేశారు.

- Advertisement -